Nobel Prize in Medicine 2023: వైద్య శాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ బహుమతి, రూ.8.35 కోట్లు పారితోషికంగా అందుకోనున్న డా.కాటలిన్ కరికో, డా.డ్రూ వీస్‌మన్
కరోనా వైరస్‌ను అరికట్టే క్రమంలో వ్యాక్సిన్ల తయారీలో మెసెంజర్ ఆర్ఎన్ఏను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది.
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు డా.కాటలిన్ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌లకు 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యురీ. కరోనా వైరస్‌ను అరికట్టే క్రమంలో వ్యాక్సిన్ల తయారీలో మెసెంజర్ ఆర్ఎన్ఏను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. హంగేరీకి చెందిన డా.కాటలిన్ కారికో, అమెరికాకు చెందిన డా.డ్రూ వీస్‌మన్‌లు చేసిన కృషికి 2021లోనే లష్కర్ అవార్డు లభించగా రెండేళ్లకు నోబెల్ బహుమతి లభించింది.
కరోనా కట్టడిలో వీరు పరిశోధించిన ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని న్యూక్లియో సైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను వీరికి ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రకటించింది స్వీడెన్ స్టాక్‌హోంలోని నోబెల్ కమిటీ. ఈసారి నోబెల్ పురస్కారాన్ని అందుకునే గ్రహీతలకు భారత కరెన్సీ ప్రకారం రూ.7.58 కోట్లుగా ఉన్న పారితోషికాన్ని పెంచుతూ రూ.8.35 కోట్లు బహుకరించనున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)