Odisha Accident: మద్యం మత్తులో బస్సును నడిపిన డ్రైవర్, బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో 5 మంది మృతి, మరో 38 మందికి తీవ్ర గాయాలు, విషాదకర వీడియో ఇదిగో..
జజ్‌పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు.
ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జజ్‌పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలించారు. జీలం నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, పలువురు గల్లంతు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
కటక్ నుంచి బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సులో 50 మంది ఉన్నారని తెలిపారు. మద్యం మత్తులో బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)