Infant Stuck in Borewell: వీడియో ఇదిగో, పాడుబడిన బోరుబావిలో పసిపాప, ఐదు గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత రక్షించిన రెస్కూ టీం

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో పాడుబడిన బోరుబావిలో కూరుకుపోయిన నవజాత బాలికను మంగళవారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన రెంగలి ప్రాంతంలోని లారిపాలి గ్రామంలో సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో చిన్నారిని సంబల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

A screengrab of the video. (Photo credits: X/@ANI)

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో పాడుబడిన బోరుబావిలో కూరుకుపోయిన నవజాత బాలికను మంగళవారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన రెంగలి ప్రాంతంలోని లారిపాలి గ్రామంలో సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో చిన్నారిని సంబల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

పాప తరపు వారు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. ఇనుపతో చేసిన 20 అడుగుల లోతున్న బోరు బావిలోకి చిన్నారి ఎలా వచ్చిందో తెలియరాలేదు. పసికందును ఎవరో అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పసికందును రక్షించడం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమె దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement