Omicron In India: దేశంలో 101 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు, మొత్తం 11 రాష్ట్రాల్లో ఆ కేసులు, అనవసర ప్రయాణాలను ఆపేయాలని కోరిన ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్‌రామ్ భార్గవ
దేశంలో ఇప్పటి వరకు 101 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాల్లో ఆ కేసులు (Omicron In India) నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.
దేశంలో ఇప్పటి వరకు 101 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాల్లో ఆ కేసులు (Omicron In India) నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. అందరూ అనవసర ప్రయాణాలను ఆపేయాలని, సామూహిక సమావేశాలను రద్దు చేసుకోవాలని, పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్‌రామ్ భార్గవ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను 91 దేశాల్లో గుర్తించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పిందన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లో డెల్టాను ఒమిక్రాన్ దాటి వేస్తుందని ఆయన తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)