Operation Ganga: సుమీ నుంచి ఇండియాకు చేరిన 242 మంది విద్యార్థులు, పోలాండ్‌ మీదుగా భారత్‌‌కు తీసుకువచ్చిన భారత అధికారులు

ఉక్రెయిన్‌లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్‌ మీదుగా భారత్‌ తీసుకువచ్చారు. ఆపరేషన్‌ గంగలో భాగంగా పోలాండ్‌లోని రెస్‌జౌ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది.

Indian students from Ukraine who arrived via the special flight (Photo/ANI)

ఉక్రెయిన్‌ (Ukraine) నుంచి భారతీయుల తరలింపు ఇంకా కొనసాగతున్నది. ఉక్రెయిన్‌లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్‌ మీదుగా భారత్‌ తీసుకువచ్చారు. ఆపరేషన్‌ గంగలో భాగంగా పోలాండ్‌లోని రెస్‌జౌ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. పోలండ్‌లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఢిల్లీకి చేరింది. మరో రెండు విమానాలు నేడు పోలాండ్‌ నుంచి రానున్నాయి. వీటిలో మరో నాలుగు వందల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)