Love Jihad Cases in Maharashtra: మహారాష్ట్రలో లక్షకు పైగా లవ్ జిహాదీ కేసులు, అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మంగల్ ప్రభాత్ లోధా
అసెంబ్లీలో లోధా మాట్లాడుతూ.. శ్రద్ధా వాల్కర్ లాంటి కేసులు జరగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మంగల్ ప్రభాత్ లోధా(Mangal Prabhat Lodha) సంచలన వ్యాఖ్యలు చేశారు.మహాలో లక్షకు పైగా లవ్ జిహాదీ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో లోధా మాట్లాడుతూ.. శ్రద్ధా వాల్కర్ లాంటి కేసులు జరగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మతాంతర వివాహాల(Interfaith Marriages) అంశంపై కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఈ అంశాలను పరిశీలిస్తుందన్నారు. అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి చెందిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. బడ్జెట్ సెషన్ సమయంలోనే కొత్త వుమెన్స్ పాలసీ(Women policy)ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)