Padma Awards 2022: ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేసిన 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద, రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం

Swami Sivananda receives Padma Shri award

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం (Padma Awards 2022) కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్‌, ఎనిమిది మందికి పద్మభూషణ్‌, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. పద్మ అవార్డుల బహూకరణ వేళ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద అవార్డు తీసుకునే ముందు ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. దీంతో స్వామి శివానందకు ప్రధాని ప్రతి నమస్కారం చేశారు. అవార్డు అందుకునే ముందు స్వామి శివానంద సభకు, రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. అవార్డు బహుకరించే ముందు రాష్ట్రపతి కోవింద్ ఆయన్ను ప్రేమతో పైకి లేపి వారించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)