HC on Preschool to Kids: మూడేళ్ల లోపు పిల్లలను స్కూల్‌కు పంపించడం చట్ట విరుద్ధం, కీలక తీర్పును వెలువరించిన గుజరాత్ హైకోర్టు

మూడేళ్ల లోపు పిల్లలను బలవంతంగా ప్రీ స్కూల్ కు పంపించడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలోకి ప్రవేశం పొందాలంటే వయసు ఆరేళ్లు నిండాలంటూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

School | Representational Image | (Photo Credits: PTI)

మూడేళ్ల లోపు పిల్లలను బలవంతంగా ప్రీ స్కూల్ కు పంపించడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలోకి ప్రవేశం పొందాలంటే వయసు ఆరేళ్లు నిండాలంటూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై హైకోర్టు విచారణ నిర్వహించింది. 2023 జూన్ 1 నాటికి ఆరేళ్ల వయసు నిండని తల్లిదండ్రులు ప్రభుత్వ నోటిఫికేషన్ ను సవాలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం..జూన్ 1 నాటికి మూడేళ్ల వయసు పూర్తి చేసుకోని విద్యార్థులను ప్రీ స్కూల్స్ చేర్చుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ విద్య, సంరక్షణ అనేవి మొదటి తరగతిలో ప్రవేశానికి చిన్నారులను సిద్ధం చేసినట్టు అవుతుందని పేర్కొంది.

 Here's News

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement