Parliament Monsoon Session: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనలు, 19 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని డిమాండ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Parliament Monsoon Session (Photo-ANI)

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నందున 19 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చెర్మైన్‌ ప్రకటించారు.

సభా కార్యకలాపాలను అడ్డుకొని, నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజులపాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ ఎంపీలు, ముగ్గురు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తెలంగాణ నుంచి బడుగు లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, దామోదర రావు సస్పెండ్‌ అయ్యారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement