Forest Conservation Amendment Bill: లోక్‌సభలో పాసైన అటవీ సంరక్షణ సవరణ బిల్లు, సరిహద్దుల వద్ద వంద కిలోమీటర్ల పరిధి వరకు ఎకో టూరిజం ఏర్పాటు
దేశ సరిహద్దుల వద్ద సుమారు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న అటవీ సంరక్షణ చట్టాల్ని మినహాయించాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జూలు, సఫారీలు, ఎకో టూరిజం సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించారు.
ఇవాళ లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు(Forest Conservation Amendment Bill) పాసైంది. దేశ సరిహద్దుల వద్ద సుమారు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న అటవీ సంరక్షణ చట్టాల్ని మినహాయించాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జూలు, సఫారీలు, ఎకో టూరిజం సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. స్వల కాల చర్చ తర్వాత అటవీ పరిరక్షణ సవరణ బిల్లు 2023కి ఆమోదం తెలిపారు. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ బిల్లుపై మాట్లాడారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖకు100 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న అడవుల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు నిర్మించే రీతిలో చట్టాన్ని సవరించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)