Patna Hotel Fire Videos: పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం, ఆరుమంది మంటల్లో సజీవ దహనం, మరికొందరికి తీవ్ర గాయాలు
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ 30 మందిని పోలీసులు రక్షించారు. ఇందుకోసం 8 అగ్నిమాపక యంత్రాలను ఘటనాస్థలికి చేర్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు.
Here's Videos