Bihar Floods: వీడియో ఇదిగో, వంతెనను తాకుతూ ప్రమాదకరంగా కోసీ నది ప్రవాహం, బ్రిడ్జి కూలుతుందా అని అరుస్తూ పరుగులు పెట్టిన ప్రజలు
బీహార్‌లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వరదలకు కోసి, బాగమతి సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ వరదలకు కోసి డ్యామ్ నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో ఆ నది ఉప్పొంగడంతో అక్కడున్న వంతెనను నీటి ప్రవాహం తాకుతున్నది.
బీహార్‌లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వరదలకు కోసి, బాగమతి సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ వరదలకు కోసి డ్యామ్ నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో ఆ నది ఉప్పొంగడంతో అక్కడున్న వంతెనను నీటి ప్రవాహం తాకుతున్నది. ఇది చూసి ఆ బ్రిడ్జిపై ఉన్న జనం భయాందోళన చెందారు. అరుస్తూ వంతెన పైనుంచి పరుగెత్తారు. దీంతో పోలీసులు స్పందించారు. మహిళలు, పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు వ్యక్తులు ఫొటోలు తీయడంలో బిజీ అయ్యారు.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)