PM Kisan Installment Date: రైతులకు గుడ్ న్యూస్, ఈ నెల 27న పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి, PM కిసాన్ స్థితిని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి

పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దాదాపు రూ.8.5 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక విడతకు రూ. 2000 మరియు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 6000 అందుకుంటారు.

PM Kisan Installment Date (photo-Wikimedia commons)

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడతను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దాదాపు రూ.8.5 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక విడతకు రూ. 2000 మరియు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 6000 అందుకుంటారు. జూలై 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నగదు అకౌంట్ లో జమ అవుతాయని తెలుస్తోంది.

రాజస్తాన్‌లోని సికార్‌లో జరగనున్న కార్యక్రమం వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు పీఎం మోదీ. అయితే రైతులు మాత్రం ఓ విషయం గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే, రైతులకు తగిన అర్హతలు పక్కా ఉండాలి. దాంతో పాటు కొన్ని పనుల్ని కూడా చేసేయాలి. లేదంటే డబ్బులు పడవు. పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే రైతులు ఇ-కేవైసీ తప్పనిసరి. ఆన్‌లైన్‌ లోనే ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ లోనే సింపుల్‌గా ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు. భూమి పత్రాలను కూడా ధృవీకరించాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తి అయితే డబ్బులు వస్తాయి చూసుకోండి.

PM Kisan Installment Date (photo-Wikimedia commons)

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)