Tirupati IIT & Visakha IIM: తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రారంభించిన మోదీ, వర్చువల్‌గా హాజరైన సీఎం జగన్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్‌ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు

PM Modi inaugurated the premises of Tirupati IIT and Visakha IIM

విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్‌ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు.  జమ్మూ కశ్మీర్‌లో రూ. 32 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ, బీజేపీ 370 సీట్లు గెలవడంలో పాత్రులు కావాలని ప్రజలకు పిలుపు

విశాఖ ఐఐఎంకు సంబంధించి 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్‌ నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలోని ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్‌ భవనాలను పూర్తి చేశారు.

Here's AP CMO Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)