Covid in India: పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు. దేశంలో గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరినట్టు స్పష్టం చేసింది.
ఇక, దేశంలో ప్రస్తుతం.. 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)