Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

ఈ ఘటనపై ప్రధాని మోదీ ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాల దాడి దేశంలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించే "పిరికిపంద ప్రయత్నాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

PM Narendra Modi at SEMICON India 2024 (Photo Credit: X/@NarendraModi)

కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాల దాడి దేశంలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించే "పిరికిపంద ప్రయత్నాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు. "కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వక దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే భయంకరమైనవి. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడా ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నామన్నారు.

కెనడాలో హిందూ ఆలయంపై దాడిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, అన్ని ప్రార్థనా స్థలాలకు తగిన​ంత రక్షణ ఉండేలా చూడాలని జస్టిన్‌ ట్రూడోకు పిలుపు

PM Modi Tweet on Temple Attack

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)