PM Modi Snorkelling Video: వీడియో ఇదిగో, సముద్రం లోపల చేపల మధ్యలో ప్రధాని మోదీ, స్నార్కలింగ్‌ చేస్తున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మోదీ సముద్రం లోపల స్నార్కలింగ్‌ చేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ సముద్రం లోపలకు వెళ్లి చేపలను చూస్తున్నట్లుగా ఉంది.

PM Modi Snorkelling Video (photo-X

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఉల్లాసంగా గడిపిన ఫోటోలను,వీడియోని షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్‌ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్‌ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్‌ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారు. సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్‌ ఉండాల్సిందేనని సూచించారు.తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మోదీ సముద్రం లోపల స్నార్కలింగ్‌ చేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ సముద్రం లోపలకు వెళ్లి చేపలను చూస్తున్నట్లుగా ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement