Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన, 1,330 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం

యూపీలోని గౌతం బుద్ధ నగర్ జిల్లాలో జేవార్‌లో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన నోయిడా జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు హాజరయ్యారు.

PM Narendra Modi lays foundation stone of Jewar Airport (Photo Credits: ANI)

యూపీలోని గౌతం బుద్ధ నగర్ జిల్లాలో జేవార్‌లో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన నోయిడా జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 1,330 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. దీన్ని 2024 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది.

దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి. కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో విమానాశ్రయం ఒకటి. శంకుస్థాపనకు ముందు ఎయిర్ పోర్ట్ డిజైన్ విశేషాలను మోదీకి నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement