PM Narendra Modi: చిడతలను వాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న భారత ప్రధాని, ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు

ఇక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

PM Narendra Modi Offers Prayers to Sant Tukaram Maharaj in Pune (Photo-ANI)

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుణేలో పర్యటించారు. ఇక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు ప్రధాని మోదీకి తుంబుర, చిడతలు బహూకరించారు. తుంబుర చేతబూనిన ప్రధాని మోదీ చిడతలను వాయించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లిఖించారు. అనేక కీర్తనలను రచించారు. ఆయన మరణానంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసినా, ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)