Temple Attacks Issue in Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడి, భారతీయ కమ్యూనిటీలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆసీస్ ప్రధాని ధాని అల్బనీస్‌

ఆ విషయంలో భారతీయ కమ్యునిటీలకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Australian PM Antony Albanese and PM Narendra Modi. (Photo Credits: Twitter@narendramodi)

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల విధ్వంసం గురించి ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయ కమ్యూనిటీలకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు మోదీ మాట్లాడుతూ..ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులకు సంబంధించిన నివేదికలు చూశాను.దీని గురించి ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు తెలియజేశాను.

ఆయన ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీల భద్రత, శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. బ్రిస్బేన్‌లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. ఆస్ట్రేలియాలో గత రెండు నెలల్లో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంసాల్లో ఇది నాలుగో ఘటన. హిందూ దేవాలయాలపై జరిగిన ఈ విధ్వంసాన్ని భారత్‌ పదేపదే ఖండించింది.

Here's Video