Parliament Chaos: పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం, రాహుల్ గాంధీ తోయడంతోనే కిందపడ్డానని తెలిపిన ఒడిషా ఎంపీ
ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తోపులాటలో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
BJP MP Pratap Sarangi injured: పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారు. ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తోపులాటలో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సారంగి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరమూ కిందపడడంతో తన తలకు గాయమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే తాను కిందపడ్డానని సారంగి చెప్పారు.
కాగా బుధవారం పార్లమెంట్ లో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీల తీరుకు నిరసనగా గురువారం బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో ఆందోళన చేశారు.అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య పార్లమెంట్ ఆవరణలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఒడిశా ఎంపీ సారంగి గాయపడ్డారు.
Pratap Sarangi Alleges ‘Push’ From Rahul Gandhi
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)