Prithvi Raj Singh Oberoi Dies: ఒబెరాయ్‌ గ్రూప్‌ అధినేత పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ మృతి, సంతాపం తెలియజేసిన ఒబెరాయ్‌ గ్రూప్స్‌

ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఒబెరాయ్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్స్‌ తన ప్రకటనలో తెలిపింది

Doyen of Indian Hospitality PRS Oberoi Passes Away (Photo Credits: X/@OCLD_In)

ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ( Chairman Emeritus of the Oberoi Group) పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ (Prithvi Raj Singh Oberoi) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఒబెరాయ్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్స్‌ తన ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఫామ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించింది.పర్యాటకం, ఆతిథ్యంలో దేశానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఒబెరాయ్‌కు 2008లో భారత్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ (Padma Vibhushan) అందించింది. ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు కూడా వరించాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)