Puducherry CM Rangasamy Covid: పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సీఎం, ఈనెల 7న పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన రంగస్వామి
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆదివారం ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆదివారం ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.కాగా ఈనెల 7న రంగస్వామి పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్. రంగస్వామి
పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్. రంగస్వామి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్‌చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుడ్ని స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ద్వారా పోటీ చేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 సీట్లను గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించిన సంగతి తెలిసిందే.