Pune Horror: ఘోర విషాదం, ట్రాక్టర్‌ వేగంగా వెళ్తుండగా ఓవర్ టేక్ చేయబోయిన బైక్, అదుపు తప్పడంతో టైర్ల కింద పడి నలిగిపోయిన ఆరు నెలల చిన్నారి

పుణె-నాసిక్‌ హైవేపై రాజ్‌గురునగర్‌ వద్ద ఓ ట్రాక్టర్‌ వేగంగా వెళ్తుండగా ఓ బైక్ ఓవర్‌ టేక్‌ చేయడనికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి బైక్‌ కిందపడిపోయింది.

Representational Picture. Credits: PTI

మహారాష్ట్రలోని పుణెలో (Pune) ఆరు నెలల చిన్నారి ట్రాక్టర్‌ టైర్ల కింద పడి నలిగిపోయింది. పుణె-నాసిక్‌ హైవేపై రాజ్‌గురునగర్‌ వద్ద ఓ ట్రాక్టర్‌ వేగంగా వెళ్తుండగా ఓ బైక్ ఓవర్‌ టేక్‌ చేయడనికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి బైక్‌ కిందపడిపోయింది. దీంతో మోటారు సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తితో పాటు మహిళ, ఆమె ఒడిలో ఉన్న ఆరు నెలల చిన్నారి రోడ్డుపై పడిపోయారు. అయితే వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ఆ చిన్నారి పైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే మృతిచెందింది. అంతసేపు ఒడిలో ఉన్న పాప తన కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)