Punjab Winter Holidays: వణికిస్తున్న చలి పులి, వారం రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన పంజాబ్ సర్కారు, దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 11 దాటినా సూర్యడు బయటకు రావడం లేదు. చల్లటి వాతావరణంలో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు అపోసోపాలు పడుతున్నారు.
పంజాబ్ రాష్ట్రాన్ని చలి పులి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 11 దాటినా సూర్యడు బయటకు రావడం లేదు. చల్లటి వాతావరణంలో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు అపోసోపాలు పడుతున్నారు. దీంతో పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించింది. 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 8 నుంచి 14 వరకు సెలవులను మంజూరు చేసింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. లూథియానా, పటియాలా, పఠాన్‌కోట్, బటిండా, ఫరీద్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)