
Hyderabad, FEB 23: మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను (Wine Shops) మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం దుకాణాలతో (Wine Shops Close) పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి.
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.