Rahul Gandhi Flying Kiss Row: స్మృతి ఇరానీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని రాహుల్ గాంధీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు
రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.
రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోదీ సర్కార్‌పై విరుచుకుపడగా.. కౌంటర్‌గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
Heres's ANI Updates
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)