Rahul Gandhi Asks Kid Autograph: చిన్నారిని అడిగి ఆటోగ్రాఫ్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన కాంగ్రెస్ నేత
రాహుల్‌గాంధీ తమిళనాడులోని ఊటీలో ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. మొత్తం మహిళలతో నడిచే ఈ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ చాక్లెట్ కూడా తయారుచేశారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారు తయారుచేసే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ చిన్నారి నోట్‌బుక్ ఇస్తూ ఆటోగ్రాఫ్ అడిగింది.
రాహుల్‌గాంధీ తమిళనాడులోని ఊటీలో ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. మొత్తం మహిళలతో నడిచే ఈ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ చాక్లెట్ కూడా తయారుచేశారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారు తయారుచేసే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ చిన్నారి నోట్‌బుక్ ఇస్తూ ఆటోగ్రాఫ్ అడిగింది. వెంటనే దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత.. ఆ తర్వాత అదే పుస్తకంపై బాలిక ఆటోగ్రాఫ్ తీసుకుని కాగితాన్ని చించి తన జేబులో పెట్టుకున్నారు. అది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. అలాగే, చాక్లెట్ ఫ్యాక్టరీలో రాహుల్ గడిపిన పూర్తి వీడియోను కూడా షేర్ చేసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)