Chhattisgarh: వీడియో ఇదిగో.. 80 అడుగులో లోతులో బాలుడు, 500 మంది ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ, పోలీసు ద‌ళాలతో 104 గంట‌ల పాటు రెస్క్యూ ఆప‌రేష‌న్, సురక్షితంగా బయటకు వచ్చిన బాలుడు

చెవిటి, మూగ స‌మ‌స్య‌లు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్‌వెల్‌లో ప‌డ్డాడు. జూన్ 10వ తేదీన ఇంటి వెనుక ఉన్న బోరులో అత‌ను ప‌డిపోయాడు.

Rahul Sahu (Photo Credits: ANI)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బోరుబావిలో ప‌డిన 11 ఏళ్ల బాలుడిని ర‌క్షించేందుకు సుమారు 500 మంది ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ, పోలీసు ద‌ళాలు..దాదాపు 104 గంట‌ల పాటు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. చెవిటి, మూగ స‌మ‌స్య‌లు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్‌వెల్‌లో ప‌డ్డాడు. జూన్ 10వ తేదీన ఇంటి వెనుక ఉన్న బోరులో అత‌ను ప‌డిపోయాడు. ఈ ఘ‌ట‌న మ‌ల్క‌రోడా డెవ‌ల‌ప్మెంట్ బ్లాక్‌లో ఉన్న పిహిరిద్ గ్రామంలో జ‌రిగింది. ఆ బాలుడు సుమారు 60 ఫీట్ల లోతులో చిక్కుకుపోయాడు. బోరుబావిలో పిల్ల‌లు ప‌డ్డ సంఘ‌ట‌న‌ల్లో ఇదే అతి సుదీర్ఘ రెస్క్యూ ఆప‌రేష‌న్ అని అధికారులు చెప్పారు. 2006లో హ‌ర్యానలోని కురుక్షేత్రలో ఓ చిన్నారిని 50 గంట‌ల త‌ర్వాత ర‌క్షించిన విష‌యం తెలిసిందే. చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను ప‌ర్య‌వేక్షించారు. బాలుడిని కాపాడిన‌ రెస్క్యూ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. చిన్నారి రాహుల్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.