Rajasthan Shocker: దారుణం, కొడుకు కళ్లముందే తండ్రిని చావబాదిన పోలీసులు, తండ్రిని కొట్టవద్దని కొడుకు పోలీసులు కాళ్లు పట్టుకున్నా వదలకుండా..

రాజస్థాన్ పోలీసులు కొడుకు ముందు తండ్రిని దారుణంగా కొట్టారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైపూర్‌లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నివేదికల ప్రకారం, పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్‌గా గుర్తించారు.

Rajasthan Cops Brutally Thrash Father In Front Of His Son in Jaipur District

రాజస్థాన్ పోలీసులు కొడుకు ముందు తండ్రిని దారుణంగా కొట్టారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైపూర్‌లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నివేదికల ప్రకారం, పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్‌గా గుర్తించారు. అతను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) మరియు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. స్థానిక సమాచారం ప్రకారం, వ్యక్తి తన భార్యతో ఏడాది కాలంగా వివాదంలో ఉన్నాడు.  ఈ వీడియో చూస్తే హోటల్ కెళ్లి పుడ్ తినడమే మానేస్తారు బాబోయ్, కస్టమర్లు మిగిల్చిన చట్నీని మళ్లీ వేరే బౌల్‌లో వేసి ఇతరులకు వడ్డిస్తున్న హోటల్ సిబ్బంది

చిరంజీలాల్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. ఘటన జరిగిన రోజు పోలీసులు అతని భార్యతో కలిసి భంకత్రోటకు చేరుకుని ఇంటి తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాళం ఎందుకు పగులగొట్టారని చిరంజిలాల్ పోలీసులను ప్రశ్నించగా, పోలీసులు అతనిని చితకబాదారు. ఆ వ్యక్తిని పోలీసులు కిరాతకంగా కొట్టిన ఘటన వీడియో వైరల్‌గా మారింది. కొడుకు మోకాళ్లపై చేతులు జోడించి, తన తండ్రిని కొట్టవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నా పోలీసులు కనికరం కూడా చూపడం లేదు. కొడుకు పోలీసు పాదాలను తాకడం వీడియోలో కనిపించింది. వీడియో వైరల్ కావడంతో, అధికారులు సంఘటనను గమనించి విచారణకు ఆదేశించారు. పోలీసుల చేతిలో కొట్టిన చిరంజిలాల్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement