Rajasthan: సెలవులు కట్..పోలీస్ స్టేషన్‌లోనే పసుపు ఫంక్షన్ వేడుకను జరుపుకున్న మహిళా కానిస్టేబుల్, రాజస్తాన్‌లోని దుంగార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆసక్తికర ఘటన
మహిళా కానిస్టేబుల్‌కు సెలవు మంజూరు కాకపోవడంతో తాను పని చేసే పోలీస్ స్టేషన్‌లోనే పెళ్లికి ముందు జరిగే ‘పసుపు ఫంక్షన్’ వేడుకను జరుపుకున్నారు.
ఆ స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పెళ్లి కుదిరింది. అయితే పెళ్లికి ముందు జరిగే పసుపు వేడుక కోసం సెలవు దొరక్క పోయేసరికి కానిస్టేబుల్ పని చేస్తున్న స్టేషన్ ముందే ఆమె తోటి ఉద్యోగులు స్టేషన్ బయటే ఈ తతంగాన్ని జరిపించారు. వారు సాంప్రదాయ ప్రకారం రాజస్థానీ పాటలు పాడుతూ పెళ్లి కాబోయే వధువుకు పసుపు పూస్తూ సాధారణంగా ఈ కార్యక్రయం ఎలా జరుగుతోందో అదే విధంగా జరిపించారు.
కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ కంటే బలంగా, అలాగే దానీ ప్రభావం తీవ్రత కూడా ఎక్కువగానే చూపిస్తోంది. దీంతో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై, పోలీసులతో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికులపై పని ఒత్తిడి తీవ్రంగానే పెరిగిందని చెప్పాలి. కేసులను పెరుగుదల కట్టడి కోసం శుక్రవారం రాజస్తాన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. శుక్రవారం ఒక్క రోజే 64 మరణాలతో 15,398 తాజా కేసులు రాజస్తాన్‌లో నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 4,83,273 కోవిడ్ కేసులు కాగా, మరణాల సంఖ్య 3,453 కు చేరుకుంది.
Here's Haldi' ceremony
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)