Rajkot Airport Canopy Collapse: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కుప్పకూలిన మరో ఎయిర్‌పోర్టు టెర్మినల్ పైకప్పు, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా కూలిన టెర్మినల్ పైఉన్న పందిరి
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో (Rajkot airport)ని ఓ టెర్మినల్ పైకప్పు (terminal collapses) శనివారం ఉదయం కూలిపోయింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలిన ఘటన మరువక ముందే గుజరాత్ (Gujarat)లో మరో ఘటన చోటు చేసుకుంది. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో (Rajkot airport)ని ఓ టెర్మినల్ పైకప్పు (terminal collapses) శనివారం ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో ఈదురు గాలులకు ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఉన్న టెర్మినల్ పైఉన్న పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కాగా, గుజరాత్‌లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. భారీ వర్షాలతో కుప్పకూలిన ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో!
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)