Newdelhi, June 28: భారీ వర్షాలతో (Heavy Rains) దేశ రాజధాని ఢిల్లీ (Delhi) అస్తవ్యస్తం అవుతున్నది. గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానలతో నగరంలోని రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఇక, భారీ వర్షాలతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం టెర్మినల్-1డి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘనటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దు చేశారు.
#WATCH | 4 people were injured after a roof collapsed at the Terminal-1 of Delhi airport.
(Video source - Delhi Fire Service) pic.twitter.com/Uc0qTNnMKe
— ANI (@ANI) June 28, 2024
కార్లు నుజ్జునుజ్జు
వర్షాల కారణంగా రూఫ్ షీట్ తోపాటు దానికి సపోర్టింగ్‌గా ఉన్న పిల్లర్లు ఈ తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిపార్టర్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.