Rashid Khan: వీడియో ఇదిగో, పరుగు కోసం రానందుకు సహచర ఆటగాడిపై బ్యాట్ విసిరికొట్టిన రషీద్‌ఖాన్, నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ సహనం కోల్పోయిన వీడియో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తంజీమ్ హసన్ షకీబ్ వేసిన బంతిని రషీద్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. బౌండరీకి వెళ్తుందనుకున్న బంతి కవర్స్‌లోకి వెళ్లింది.

Rashid Khan Throws His Bat in Anger After Karim Janat Turns Down a Second Run in AFG vs BAN ICC T20 World Cup 2024 Super 8 Match

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ సహనం కోల్పోయిన వీడియో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తంజీమ్ హసన్ షకీబ్ వేసిన బంతిని రషీద్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. బౌండరీకి వెళ్తుందనుకున్న బంతి కవర్స్‌లోకి వెళ్లింది. అప్పటికే ఒక పరుగు పూర్తిచేసిన రషీద్ రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ పిచ్ మధ్యకు వచ్చేశాడు. అయితే, అప్పటికే స్ట్రైకర్ ఎండ్ వద్దకు చేరుకుని నిల్చున్న కరీమ్ జనత్.. రషీద్‌ను వారించాడు. వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించాడు. రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రషీద్‌ఖాన్ సహనం కోల్పోయి తన బ్యాట్‌ను బలంగా జనత్ వైపు విసిరికొట్టాడు. అదికాస్తా అతడి కాళ్ల వద్దకు వెళ్లి ఆగింది. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న వారితోపాటు టీవీల్లో వీక్షిస్తున్న వారు సైతం రషీద్ ప్రవర్తనకు విస్తుపోయారు. ఈ ఘటనపై రషీద్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని మరికొందరు తప్పుబట్టగా, కొందరు మాత్రం రషీద్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 10 బంతుల్లో 19 పరుగులు చేసిన రషీద్.. పరుగులేమీ చేయకుండా నిల్చుని పరుగు తీసేందుకు నిరాకరించిన పార్ట్‌నర్‌పై బ్యాట్ విసరడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now