టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. తద్వారా, అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ఆరోన్ జోన్స్... 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది. ఇవాళ రోహిత్ శర్మ ధాటికి ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ బలయ్యాడు. స్టార్క్ విసిరిన ఒక ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 4 సిక్సులు, 1 ఫోర్ బాదడం విశేషం.అలాగే టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేశాడు
Milestone 🔓
Captain Rohit Sharma reaches 2️⃣0️⃣0️⃣ sixes in T20 Internationals 👏
Follow The Match ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #TeamIndia | #AUSvIND | @ImRo45 pic.twitter.com/6LW6SJIky4
— BCCI (@BCCI) June 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)