RBI Cuts Repo Rate: ఆర్‌బీఐ గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత వడ్డీరేట్లు సవరింపు, రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపునిస్తూ గుడ్ న్యూస్ తెలిపింది. రెపో రేటును (RBI Cuts Repo Rate) 0.25 శాతం మేర తగ్గించింది.ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది.
ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపునిస్తూ గుడ్ న్యూస్ తెలిపింది. రెపో రేటును (RBI Cuts Repo Rate) 0.25 శాతం మేర తగ్గించింది.ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరడం గమనార్హం.
జొమాటో పేరు మారింది... ఇకపై ఎటర్నల్, అఫిషియల్‌గా ప్రకటించిన జొమాటో యాజమాన్యం
2020 మే నెలలో రెపో రేటు (Repo Rate)ను 40 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ తగ్గించింది.తర్వాత 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచుతూ వచ్చిన కేంద్ర బ్యాంకు.. తాజాగా 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది.ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి పరపతి విధాన సమీక్ష ఇది. ఈ ఏడాది మార్చితో ముగిసే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4శాతం ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా వేసింది.
Reserve Bank of India Cuts Repo Rate by 25 Bps to 6.25%
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)