Arun Goyal: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్ గోయల్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం, గత మే నెలలో సీఈసీ పదవీ బాధ్యతల్లోకి వచ్చిన రాజీవ్ కుమార్

Election Commission of India. File Image. (Photo Credits: PTI)

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆయన గత మే నెలలోనే సీఈసీ పదవీ బాధ్యతల్లోకి వచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement