Mohan Bhagwat Covid: కరోనా బారీన పడిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్న రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌, నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరిక

రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. దీంతో ఆయన నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు సాధారణ పరీక్షలు చేశారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Mohan Bhagwat Covid (Photo-PTI)

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 58,993 కరోనా కేసులు రికార్డవగా.. 301 మరణాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ముంబైలో 9,200 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement