Russia-Ukraine Tensions: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదిలి దేశానికి రండి, రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలున్నాయని తెలిపిన దౌత్య కార్యాలయం
ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే తాత్కాలికంగా ఆ దేశం విడిచి రావాలని దౌత్యకార్యాలయం ఆ ప్రకటనలో కోరింది.
ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే తాత్కాలికంగా ఆ దేశం విడిచి రావాలని దౌత్యకార్యాలయం ఆ ప్రకటనలో కోరింది. అత్యవసరం కానీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అక్కడి భారతీయులను ఎంబసీ కోరింది. అవసరం అయితే తప్ప ఆ దేశానికి వెళ్లవద్దు అని కూడా ఎంబసీ కార్యాలయం పేర్కొన్నది. కీవ్‌లో ఉన్న ఎంబసీతో భారతీయులు టచ్‌లో ఉండాలని, ఏదైనా విపత్తు జరిగితే తక్షణమే అక్కడికి సహాయం పంపేందుకు సమాచారం ఇవ్వాలని ఎంబసీ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు సహాయసహకారాలు అందించేందుకు ఎంబసీ నిత్యం పనిచేస్తుందని అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)