Pornography Case: పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ముందస్తు బెయిల్, రాజ్‌కుంద్రాతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముందస్తు బెయిల్‌ను మంజూరీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరీ చేసింది. 2020లో ముంబైలో రాజ్‌కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోర్న్ కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు రాజ్‌కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో సుమారు మూడు నెలల పాటు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్‌కుంద్రాతో పాటు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, ఉమేశ్ కామత్‌లకు కూడా ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరీ చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)