SC on Bribery Cases: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని స్పష్టం చేసిన ధర్మాసనం

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.1998లో దీనిపై ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది.

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.1998లో దీనిపై ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

దీని ప్రకారం.. పార్లమెంటు/శాసనసభలో ఓటు/ప్రసంగానికి సంబంధించి లంచం ఆరోపణపై ఒక MP లేదా MLA ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు పొందలేరని తాజా తీర్పులో సుప్రీంకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది . గతంలో 1998 పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది.  చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ , పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement