Bengaluru Pothole Incident: బెంగళూరు రోడ్లు పరిస్థితి తెలిపే షాకింగ్ వీడియో, మరో బస్సును క్రాస్ చేస్తూ గుంతలో కూరుకుపోయిన బస్సు, 20 మంది పిల్లలకు తప్పిన పెను ప్రమాదం

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని రోడ్లు గుంతలతో నిండిపోయిన దురవస్థ కారణంగా ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి.

School Bus Nearly Topples After Hitting Massive Pothole in Bengaluru

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని రోడ్లు గుంతలతో నిండిపోయిన దురవస్థ కారణంగా ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఒక బస్సు ముందుగా వెళ్లగా, మరొక బస్సు దాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే సుమారు 20 మంది విద్యార్థులు ఉన్న ఆ స్కూల్ బస్సు, పక్కన ఉన్న బురద మయమైన గుంతలో కూరుకుపోయింది. బస్సు సగానికిపైగా ఒక వైపుకు వంగి నిల్చుకుంది.

ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు

ఈ ప్రమాదం కారణంగా ఆ బస్సులో ఉన్న పిల్లలలో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. సంఘటన గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అక్కడికి చేరుకుని బస్సు విండోలను తెరిచి ఎమర్జెన్సీ డోర్లు ద్వారా పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకున్నారు. ఈ సంఘటన స్కూల్ బస్సు వెనుక ఉన్న కారు డ్యాష్‌బోర్డు కెమెరా ద్వారా వీడియోగా రికార్డు అయింది. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అయి ప్రజలలో తీవ్ర చర్చకు దారి తీసింది.పోలీసులు ప్రస్తుతానికి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, పరిస్థితి మరింత ప్రమాదకరమవ్వకుండా పరిశీలనలు చేస్తున్నారు.

School Bus Nearly Topples After Hitting Massive Pothole in Bengaluru

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement