ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో కోర్టు సిబ్బంది, లాయర్లు, కేసులు విచారించేందుకు వచ్చిన ప్రజలు వెంటనే బయటకు పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దూకడంతో ఘటనా స్థలంలో సమగ్ర తనిఖీలు ప్రారంభించారు. అయితే, చివరకు ఎలాంటి బాంబు హానికర వస్తువులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఈ సంఘటన మరువక ముందే మధ్యాహ్నం బాంబే (ముంబై) హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ అందింది. దీంతో ముంబై హైకోర్టులో కూడ లాయర్లు, కోర్టు సిబ్బంది, విచారణకు వచ్చిన పబ్లిక్‌ను భద్రతా చర్యలతో వెంటనే వెలుపలకు పంపించారు. అక్కడ కూడా బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని సమగ్ర తనిఖీలు చేపట్టింది.
తనిఖీలల్లో ఎలాంటి బాంబు లేదా అనుమానాస్పద వస్తువులూ లభించకపోవడంతో అక్కడ కూడా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్‌ను పంపిన వ్యక్తిని గుర్తించేందుకు ట్రేసింగ్ ప్రయత్నాలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి రెండు హైకోర్టులలో కూడా భద్రతా పరిస్థితిని మరింత కట్టుబడి ఉంచుతూ పూర్తి అప్రమత్తతా చర్యలు తీసుకుంటున్నారు.
Bomb Threat Email:
#WATCH | Delhi | New Delhi DCP Devesh Kumar Mahla says, "...We have checked the court premises and it was a hoax call..." https://t.co/r9gc8NFcRA pic.twitter.com/sMwUXOWBnB
— ANI (@ANI) September 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)