Anjan Bandopadhyay Dies: సీనియర్ జర్నలిస్ట్ అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన వెస్ట్ బెంగాల్ గవర్నర్
టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. దీంతో బెంగాల్ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రముఖ టీవీ యాంకర్‌లలో అంజన్ బందోపాధ్యాయ్ ఒకరు.
టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. దీంతో బెంగాల్ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రముఖ టీవీ యాంకర్‌లలో అంజన్ బందోపాధ్యాయ్ ఒకరు. ఆయన జీ 24 గంట బెంగాల్ టీవీ ఛానల్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాంకర్‌గా కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంజన్ కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. కొన్ని రోజులకు మళ్లీ కరోనా తిరగబెట్టింది.
తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మృతిచెందారు. అంజన్ బందోపాధ్యాయ్ జర్నలిజంలో 33 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అంతకుముందు ఆనంద్‌బజార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. అంజన్ బందోపాధ్యాయ్ మరణంపై వెస్ట్ బెంగాల్ గవర్నర్ సంతాపం వ్యక్తం చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)