Scientist S Somanath: ఇస్రో చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త సోమనాథ్‌, కె శివన్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు

ప్రస్తుతం విక్రంసారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు.

Scientist S Somanath (Photo/kerala CM Twitter)

ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన విక్రంసారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత (జనవరి 12, 2022) ప్రపంచంలోని ప్రముఖ​ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్‌ అధిపతిగా వ్యవహరించనున్నారు. సోమనాథ్ నియామకంపై కేరళ సీఎం పినరయి విజయన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)