Cash-for-Jobs Scam Case: క్యాష్ ఫర్ జాబ్ కేసు, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేసిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఎక్సైజ్, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుండి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి బర్తరఫ్ చేశారు.
Senthil Balaji Dismissed From Council of Ministers: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఎక్సైజ్, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుండి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి బర్తరఫ్ చేశారు. క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తున్నట్టు రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
క్యాష్ ఫర్ జాబ్ వ్యవహారంలో మనీలాండరింగ్ అభియోగాలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ నెల 14న అరెస్ట్ చేశారు. మంత్రి అరెస్ట్ ను సీఎం స్టాలిన్ సహా ఇతర మంత్రిమండలి సభ్యులు ఖండించారు. తాజాగా గవర్నర్ చర్య, సెంథిల్ ను తప్పించడానికి గల కారణాలతో రాజ్ భవన్ వెలువరించిన ప్రకటన డీఎంకే ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)