Mumbai Court on Sex Work: వ్యభిచారం నేరం కాదు, అయితే అది బహిరంగ ప్రదేశాల్లో చేస్తే ఇతరులకు ఇబ్బంది, కీలక వ్యాఖ్యలు చేసిన ముంబయి సెషన్స్ కోర్టు

వ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని, అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది.

Representational Image (Photo Credit: ANI/File)

వ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని, అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది. ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు.

కోర్టులో ఆమెను హాజరుపర్చగా, ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చారు. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు... ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది.  ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని వివరించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now