Karnataka: మహిళా లాయర్‌ని నడిరోడ్డుపై కడుపులో బలంగా తన్నిన వ్యక్తి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు
ఓ వ్యక్తి పశువులా మారి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిని తన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని వినాయక్ నగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాగల్‌కోట్‌కు చెందిన మహంతేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న యూనివర్సిటీలో ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.
ఓ వ్యక్తి పశువులా మారి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిని తన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని వినాయక్ నగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాగల్‌కోట్‌కు చెందిన మహంతేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న యూనివర్సిటీలో ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మహంతేష్ ఇంటి పక్కనే సంగీత అనే లాయర్ కూడా నివసిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి.
ఓ సివిల్ కేసులో మహంతేష్‌ను సంగీత ఇబ్బందులకు గురి చేసింది. అదును కోసం ఎదురు చూసిన మహంతేష్.. శనివారం మధ్యాహ్నం సంగీతపై నడిరోడ్డుపై దాడి చేశాడు. ఆమె చెంపలపై కొడుతూ.. కడుపు భాగంగా బలంగా తన్నాడు. అతన్ని తప్పించుకునేందుకు అక్కడున్న కుర్చీని అడ్డు పెట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. సంగీతపై బలంగా తన్నాడు మహంతేష్. ఈ కేసులో మహంతేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)