HC on Compassionate Appointment: సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కు ఉండదు, కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు, మేజర్లు అయిన తర్వాత ఇద్దర్నీ ఒకే కుటుంబ సభ్యులుగా పరిగణించలేమని వెల్లడి

రాజ్యంగ నిబంధనల ప్రకారం కుటుంబం అంటే తల్లీ, తండ్రి, భార్య, పిల్లలు మాత్రమేనని, మేజర్లు అయిన తర్వాత సోదరుడు, సోదరి ఒకే కుటుంబసభ్యులుగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

Karnataka High Court (Photo-PTI)

వివాహిత సోదరుడు మరణించిన తర్వాత సోదరి కారుణ్య నియామకం కోరుకోలేరని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన పల్లవి (29).. మరణించిన తన సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రసన్న బి వరాలే, జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని తెలిపింది.  రాజ్యంగ నిబంధనల ప్రకారం కుటుంబం అంటే తల్లీ, తండ్రి, భార్య, పిల్లలు మాత్రమేనని, మేజర్లు అయిన తర్వాత సోదరుడు, సోదరి ఒకే కుటుంబసభ్యులుగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

Here's Live Law Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement