Sivakasi Fire Accident: శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం, 9 మంది అగ్నికి ఆహుతి, వీడియో ఇదిగో..
శ్రీ సుదర్శన్ ఫైర్ వర్క్స్ కంపెనీలో జరిగిన భారీ పేలుడు కారణంగా 9 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. 12 మందికి తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి.
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లా శివకాశి వద్ద ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీ సుదర్శన్ ఫైర్ వర్క్స్ కంపెనీలో జరిగిన భారీ పేలుడు కారణంగా 9 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. పూజ చేస్తుండగా అదుపుతప్పి గుడిలోకి దూసుకెళ్లిన కొత్త కారు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
12 మందికి తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి. టపాకాయల్లో నింపేందుకు రసాయన పదార్థాలు సిద్ధం చేస్తుండగా, ఒక్కసారిగా పీడనం పెరిగిపోవడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. జిల్లా ఎస్పీ ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ కంపెనీకి లైసెన్స్ ఉందని వెల్లడించారు. రసాయన పదార్థాలను కలుపుతుండగా, ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయి పేలుడు సంభవించినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.
Here's ANI Video